Fakhar Zaman: నేను రిటైర్ అవ్వట్లేదు..ఫకర్ జమాన్ 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) సందర్భంగా గాయపడ్డ ఫకర్.. ఆ తర్వాత టోర్నీకి దూరమయ్యాడు. ఆ నేపథ్యంలో అతడు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై ఫకార్ స్పందించాడు. క్రికెట్ నుంచి తాను రిటైర్ కావాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ ఖండించాడు. అన్ని ఫార్మాట్లలో కొనసాగాలనుకుంటున్నానని, నెల రోజుల్లో ఫిట్నెస్ సాధిస్తానని చెప్పాడు.